ఏపీలో కొత్త మద్యం విధానం

posted on: Jul 31, 2024 5:13PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిన నేపథ్యంలో నూతన మద్యం విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. లిక్కర్ బాటిల్స్‌కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా చర్చించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...