కొత్త రాజ‌ధానికి క‌నీసం 2.5 ల‌క్షల కోట్లు

posted on: Aug 2, 2013 9:01PM

 

తెలంగాణ ప్రక‌ట‌న త‌రువాత ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న విష‌యం కొత్త రాజ‌ధాని ఏది అనే. 10 సంవ‌త్సరాల పాటు హైద‌రాబాద్ ఉమ్మడి రాజ‌ధానిగా ఉన్న ఆ త‌రువాత సీమాంద్ర ప్రాంతానికి రాజ‌ధానిగా ఉండ‌బోయే న‌గ‌రం ఏది అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ ప్రజ‌ల్లో కూడా క‌నిపిస్తుంది. హైద‌రాబాద్‌కు దీటైన రాజ‌ధాని నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ స‌హ‌క‌రిస్తుందని ప్రక‌టించారు దిగ్విజ‌య్ సింగ్‌.

అయితే అది అన్నంత ఈజీ కాంద‌టున్నారు విశ్లేష‌కులు. సరైన మౌలిక వసతులతో రాష్ట్ర రాజధానిని నిర్మించాలంటే రూ.2.5 లక్షల కోట్లు  ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్థుతం ఉన్న న‌గరాల‌కు చేరువ‌లోనే ఓ రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో కేంద్ర ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే డిల్లీ ఐఐటి నిపుణుల‌తో పాటు, హైద‌రాబాద్ కు చెందిన వాడ ఫాండేష‌న్ కొత్త రాజ‌ధాని విష‌యంలో అధ్యనం చేస్తున్నారు.

రాజ‌ధాని ఏర్పాటుకు ముఖ్యంగా కావాల్సింది విస్తారమైన రవాణా సౌకర్యాలు. అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్డు రవాణా వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు అనుసంధానం చేసే వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు. అధ్యయన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించనున్నట్లు సమాచారం. హైదరాబాదు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి యేటా 5 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని హెచ్‌ఎండిఎ ఏర్పాటు చేసిన సమగ్ర రవాణా వ్యవస్థ అధ్యయనం తెలిపింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...