కేటీఆర్ సభలో నేరేళ్ల బాధితుడి ఆత్మహత్యాయత్నం

posted on: Nov 30, 2018 2:28PM

 

మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న నేరెళ్ల బాధితుడు అత్మహుతుకి యత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటన బాధితులకు మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయకపోగా తమపై పోలీసులతో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని నినదిస్తూ బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు. తనను చంపేస్తారంటూ రోదించాడు. మా జీవితాలు నాశనం చేసిండు,పోలీసులతో కొట్టించాడు,నేను చేసిన తప్పేంది అంటూ రోదించాడు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకొని తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండేళ్ల క్రితం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటానికి లారీలను తగలబెట్టిన ఘటనలో 11 మందిపై కేసులు నమోదు కాగా అప్పటి ఎస్పి విశ్వజిత్ కాంపాటి హయాంలో 8మంది బాదితులకు ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...