బస్సు ప్రమాదం.. 12 మంది మృతి

posted on: Apr 22, 2015 11:08AM

 

నేపాల్‌లో బుధవారం ఉదయం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గుజరాత్‌కి చెందిన 12 మంది యాత్రికులు మరణించారు. కాట్మండూ‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించిన అనంతరం ఇండియాలోని గోరఖ్‌పూర్ వస్తున్న యాత్రికుల బస్సు దడింగ్ వద్ద కొండ ప్రాంతంలో ప్రయాణిస్తూ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖాట్మండూలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...