TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరోసారి నేపాల్ లో భూకంపం

Published on: Sat May 2, 2015 11:51AM

 

భూకంపం వల్ల ఇప్పటికే నేపాల్ అతలాకుతలమై పోయింది. ఈ భూకంప వల్ల ఇప్పటి వరకు 6,624 మంది మరణించగా, దాదాపు 14 వేల మందికి గాయాలయ్యాయి. అయితే నేపాల్ ప్రజలు ఇంకా భూకంపం ప్రభావం నుండి తేరుకోకముందే మళ్లీ శనివారం ఉదయం మరోసారి భూకంపం వచ్చింది. దీంతో నేపాల్ ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎన్నో దేశాలు నేపాల్ కు సహయ చర్యలు అందించడానికి ముందుకొచ్చినా.. వర్షాలు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో సహాయ సిబ్బందికి కొంత కష్టంగానే ఉంది.