వీళ్లు మనుషులేనా.. అక్కడ కూడా సెల్పీలా?

 

ఈ రోజుల్లో సెల్ఫీల గోల మరీ ఎక్కువైపోయింది. ఎక్కడికెళ్లినా టపీ మని ఒక సెల్ఫీ తీసుకోవడం దానిని ఫెస్ బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేయడం. ఇలా టపీ మనీ సెల్ఫీ తీసుకుంటూ టపీ మని టపా కట్టేసినోళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఈ పిచ్చి ఎంత ముదిరిందంటే.. కఠ్మాండులో భూకంపం వచ్చి బాధితులు తినడానికి తిండి, నీళ్లు, బట్టలు లేక అల్లాడిపోతుంటే ఒక పక్క సెల్పీల గోల మొదలైంది. కఠ్మాండులోని చారిత్రక ధారాహర టవర్ భూకంపం వల్ల కుప్పకూలిపోయింది. చారిత్రక కట్టడం అంటూ అక్కడికి వచ్చిన వారంతా శిథిలాలపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకొని సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక వైపు భూకంప బాధితులు బాధపడుతుంటే, ఇక్కడికి వచ్చిన వారు నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు.