TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీసుల పహారాలో నెల్లూరు

Published on: Wed Jul 30, 2025 7:07PM

 

వైసీపీ అధినేత జగన్ గత పర్యాటనలలో చేదు అనుభవాలు దృష్ట్యా. రేపు నెల్లూరు జిల్లా పర్యాటనకు పోలీసులు పటిష్థత బందోబస్తుతో పాటు గట్టి ఆంక్షలు విధించారు. నెల్లూరు పట్టణంలో 34 పోలీసు యాక్టు అమలుతోపాటు, ర్యాలీలు, గుంపులుగా చేరడాన్ని పోలీసులు నిషేధించారు. వైసీపీ నాయకులతోపాటు ముఖ్యమైన కార్యకర్తల స్థాయి వారితో సహా వెయ్యి మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అల్లర్లు, తొక్కసలాట జరిగిన కేసులు పెడతామని వారిని హెచ్చరించారు. 

గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు జైలు వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్‌లో హెలికాప్టరు‌లో చేరుకున్న జగన్, జైలులో మాజీ మంత్రి కాకణి గోవర్థన్‌రెడ్డి‌ని ములాఖత్‌లో కలవనున్నారు. అనంతరం ఇటీవల దాడికి గురైన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపూరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరిగి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 

నెల్లూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు రేపు కఠినతర నిషేధాలు అమలు చేస్తున్నారు. జగన్ పర్యాటనకు హెలీప్యాడ్ దగ్గర, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పరిమిత సంఖ్యలో నాయకులు హాజరుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఘనంగా హాజరు కావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో నెల్లూరు పట్టణంలో రేపు జరగుతుందో జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు