Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి
posted on: Jun 8, 2025 5:01PM

నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతు సింహపురి ఉక్కుమనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. నెల్లూరు రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గోన్నారు.


.webp)



