బీహార్ లో ఎన్డీయే హవా.. 121 స్థానాల్లో ముందంజ

posted on: Nov 14, 2025 8:26AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఆధిక్యతలను బట్టి ఎన్డీయే ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ప్రస్తుతం ఎన్డీయే కూటమి గెలుపుబాటలో ఉంది.

ఆ కూటమి  అభ్యర్థులు 123 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి అభ్యర్థులు 71 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తున్నారు. మహువా స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ వెనుకంజలో ఉన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...