ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠం

posted on: Feb 25, 2026 3:44PM

 

ఎన్సీఈఆర్టీ 8వ తరగతి  పుస్తకంలో" న్యాయవ్యవస్థలో అవినీతి" అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు  తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఎన్సీఈఆర్టీ  ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ప్రచురించిన అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను కవర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 26 కోట్ల మంది సీబీఎస్ఈ,  ఇతర రాష్ట్ర బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిలబస్ ఫాలో అవుతుంటారు. అటువంటి ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా పాఠ్యాంశాన్ని పొందుపరచడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. 

అటువంటి ప్రయత్నాలను సహించమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.  దీనికి సంబంధించి తగ్గిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  న్యాయవ్యవస్థకు ఉన్న అతిపెద్ద  సవాళ్లు  అవినీతి , న్యాయమూర్తుల ఖాళీలని..   ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు.  అలా న్యాయ వ్యవస్థను అవినీతి మయమని పేర్కొనడం ఆందోళనకరమని  సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని సుమోటో కేసుగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...