ఆ రేటుకు ఒప్పేసుకుంది

Publish Date:Aug 30, 2013

Advertisement

 

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత హీరయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. వయసు మీదపడుతున్న కొద్దీ హీరోయిన్ల గుండెల్లో గుబులు పెరుగుతుంది.. అందుకే అందం ఉండగానే అందినంత సంపాదించేయాలనుకుంటున్నారట. అందుకే ఓ భామ సినిమాలతో పాటు యాడ్స్ కు కూడా బాగా కాసులు వసూలు చేస్తుంది.

ఏజ్ బార్ అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఈ హీరోయిన్లు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. నయనతార కూడా ఇప్పుడు అదే జాభితాలో చేరింది.

కొన్నేళ్లుగా పరిశ్రమలో తెలుగు , తమిళ భాషల్లో నటిస్తూ వచ్చిన నయన్‌ ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. కొత్త వాళ్లు ఎంతమంది వచ్చినా గ్లామర్ విషయంలో మాత్రం నయన్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

అంతేకాక అమ్మడు ఇమేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో కొన్ని వివాదాలతో గ్యాప్ తీసుకున్న రీ ఎంట్రీలో మరోసారి దుమ్ములేపింది ఈ బ్యూటి దీంతో బ్రాండ్ అంబాసిడర్గా కూడా నయన్కు మంచి క్రేజ్ వచ్చింది.
హైదరాబాద్ లో ని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ త్వరలో ప్రారంభిస్తున్న ఓ బ్రాండుకు నయనతారను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే నయన్ కూడా అందుకు అంగీరించిందట.