Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ పొలిమేరల్లో నక్సలైట్లు ?
posted on: Sep 25, 2024 2:28PM

చత్తీస్ గడ్, ఒడిషా నుంచి మావోయిస్టులు తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. దీంతో ఆ రాష్ట్రాల్లో తలదాచుకున్న మావోయిస్టులు తెలంగాణ సేఫ్ ప్లేస్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. మావోయిస్టులు పిట్టల్లా రాలిపోయారు. పౌరహక్కు సంఘం నేతలు ఆయా ప్రాంతాలకు వెళ్లి నిజనిర్ధారణ కమిటీలు వేసి విచారణ జరుపుతున్నారు. గత జూన్ లో చత్తీస్ గడ్ అబూజ్ మడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగి ఎనిమిదిమంది నేల కొరిగారు. మేనెలలో దంతెవాడ బీజ్ పూర్ సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు . భధ్రతా బలగాలు జరిపిన ప్రతి కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు. మే చివరి వారంలో చత్తీస్ ఘడ్ బస్తర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగి ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు. ఈ యేడు ఏప్రిల్ మాసంలో కూడా చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ జరిగి ఒక నక్సలైట్ చనిపోయారు. బీజాపూర్ వద్ద ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే భధ్రతాబలగాలు ప్రతికాల్పులు జరిపితే ఒక నక్సలైట్ చనిపోయారు. ఒడిశాలో కూడా మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు అప్రమత్తమై తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేసింది. అయితే ఈ వార్తలను తెలంగాణ డిజిపి ఖండించారు.



.webp)


