TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాబిల్లి రాదు.. మనమే వెల్దాం!

Published on: Mon Aug 29, 2022 10:24AM

అర్ధ శతాబ్బం తరువాత మళ్లీ చంద్రునిపై మనుషులు అడుగు పెట్టేందుకు తొలి అడుగు పడిందివ. తర్వాత చంద్రునిపై మళ్లీ  ఆర్టెమిస్‌-1 మిషన్‌లో భాగంగా   నాసా మూన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెడుతోంది.

చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగు పెట్టి ఏభై ఏళ్లు దాటింది.   1969లో అమెరికాకు చెందిన   నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ తొలిసారిగా చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్‌ ద్వారా 24 మందిని నాసా చంద్రుడి వద్దకు పంపింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలు మోపారు.

అంతే ఆ తరువాత ఆ తర్వాత ఎవ్వరు ఇంత వరకూ చంద్రుని మీద అడుగు పెట్టలేదు.  నాసా అపోలో 17 మిషన్‌కు 2022 డిసెంబర్‌తో  ఐదు దశాబ్దాలు  పూర్తవుతాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుట్టింది. ఈసారి మూన్ మిషన్‌కు  ఆర్టిమిస్ ప్రోగ్రామ్  అని నామకరణం చేసింది.