ప్రధాని అభ్యర్ధి మోడినే

posted on: Jul 9, 2013 2:21PM

 

Narendra Modi for PM post, Narendra Modi BJP, BJP Narendra Modi

 

 

మోడి పట్టాభిషేకానికి ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగుతున్నాయి.. ఇటీవల ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టి మోడి పార్టీలో తన పట్టును మరింత పెంచుకోవటానికి పావులు కదుపుతున్నారు.. అందుకు తగ్గట్టుగానే పార్టీ పెద్దలు చాలా మంది మోడికి మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం..

 

అయితే చాల రోజులుగా ఎన్డీఏ ప్రదాని అభ్యర్థి మోడినే అన్న వాదం బలంగా వినిపిస్తున్న ఇంత వరకు పార్టీ వర్గాలు మాత్రం ఆ విషయాన్ని ద్రువీకరించలేదు.. అయితే ఎన్నికల సమయం మరింత దగ్గరపడుతుండటంతో ఈ నెలాఖరు వరకు మోడినే ప్రదాని అభ్యర్థిగా ప్రకటిస్తారంటున్నాయి పార్టీ వర్గాలు..
       

అంతే కాదు వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోడి ఎంపిగా పోటి చేయనున్నారని కూడా అంటున్నారు. అందుకోసం ఇప్పటికే నియోజిక వర్గాన్ని కూడా ఎంచుకున్నారట.. బలమైన హిందూ వాదిగా పేరున్న మోడి ఏదైనా హిందూ దార్మిక స్థలం నుంచి పోటి చేయాలనుకుంటున్నాడట..
       

ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి మోడి పోటి చేయాలని భావిస్తున్నాడట. బిజెపి కంచుకోటగా భావించే ఈ ప్రాంతం నుంచి ప్రస్థుతం మురళి మనోహర్‌ జోషి ప్రతినిధ్యం వహిస్తున్నారు..
       

ప్రస్థుతానికి ఇవన్నీ ఊహాగానాలుగా కొట్టిపారేసిన ఎన్డీఎ భవిష్యత్తు దృష్ట్యా త్వరలోనే మోడిని ప్రదాని అభ్యర్థిగా ప్రకటించటం మాత్రం కాయం అంటున్నాయి పార్టీ వర్గాలు..

google-ad-img
    Related Sigment News
    • Loading...