బాబు చక్రం తిప్పాడు.. మోడీ దిగొచ్చాడు...

posted on: Jun 4, 2018 4:34PM


 
మిత్రులుగా ఉన్నప్పుడు అన్నీ మంచిగా కనిపిస్తాయి.. ఎప్పుడైతే శత్రువులుగా మారతారో అప్పుడే ఎదుటివారి తప్పులు తెలుస్తాయి.. ఇదే మోడీ, చంద్రబాబుల మధ్య జరిగింది.. మొన్నటి వరకు మోడీకి తిరుగులేదనుకున్నారంతా.. కానీ ఏపీకి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని సహించలేక బాబు దూరమవ్వడం.. కర్ణాటకలో బీజేపీ ఓటమి.. రీసెంట్ గా ఉపఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవం ఇవన్నీ చూస్తుంటే మోడీ హవా ఎంతలా తగ్గిందో అర్ధమవుతుంది.. దీనికి తోడు మోడీ కక్ష సాధింపు చర్యలు కూడా బయటపడుతున్నాయి.. విభజన చట్టం ప్రకారం ఏపీ లోని ఏడు జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు చొప్పున మొత్తం 350 కోట్లను కేంద్రం ఇస్తుంది.. ఇంతవరకు బానే ఉంది.. ఎప్పుడైతే బాబు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడే మోడీ గేమ్ స్టార్ట్ అయింది.. ఈ ఏడాది ఏపీకిచ్చిన 350 కోట్లని RBI ద్వారా వెనక్కి తెప్పించుకున్నాడు.. మరి బాబు ఊరుకుంటాడా.. ఈ విషయాన్ని అకౌంట్ డీటైల్స్ తో సహా జాతీయ స్థాయిలో తెలిసేలా చేసాడు.. ఏపీ మీద మోడీ చేసిన ఈ కక్ష సాధింపు చర్యకి మీడియా మరియు కొందరు సీనియర్ నాయకులు మోడీకి చివాట్లు పెట్టారు.. మోడీ దెబ్బకు దిగొచ్చాడు.. ఏపీకి 350 కోట్లు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.. మరొక్కసారి కేంద్రానికి తెలుగోడి దెబ్బ ఏంటో తెలిసిందన్నమాట...

 

google-ad-img
    Related Sigment News
    • Loading...