Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాంబులు పేలుతున్నాయ్.. మోడీకి భద్రత పెంచండి: బీజేపీ
posted on: May 1, 2014 3:44PM
.jpg)
చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్ళలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ బాంబులు ఆంధ్రప్రదేశ్‌లో పేలడానికి ఉద్దేశించి పెట్టినవేనని, అయితే ట్రెయిన్ గంటన్నర సేపు చెన్నై స్టేషన్‌లోనే ఆగిపోవడం వల్ల అక్కడే పేలుళ్ళు జరిగాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నందున, ఆయనకు హెచ్చరిక ఇచ్చే విధంగా ఈ బాంబు పేలుళ్ళు జరపడానికి తీవ్రవాదులు ప్లాన్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన మీద భారతీయ జనతాపార్టీ స్పందించింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ చెందిన యువతి మరణించడం, పలువురు గాయపడటం మీద తన బాధను వ్యక్తం చేసింది. దీంతోపాటు బీజేపీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది. ఈ సంఘటన మోడీ ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వున్నారో తెలియచెబుతోందని, కాబట్టి మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.


.jpg)
.jpg)


