ఇద్దరు సీఎంలతో గవర్నర్ భేటీ?
Published on: Tue Jun 23, 2015 11:00AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంగళవారం నాడు భేటీ అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో గవర్నర్‌కి శాంతిభధ్రతల అంశాన్ని అప్పగించే అవకాశం వుందన్న వార్తలు వస్తూ వుండటం, ఈ విషయంలో అటార్నీ జనరల్ నరసింహన్‌కి కీలక సూచనలు చేశారన్న వార్తలు కూడా వినిపిస్తు్న్న నేపథ్యంలో గవర్నర్ ఈ భేటీని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రెండు రాష్ట్రాల రాజకీయాలలో మార్పులు వచ్చే అవకాశాలు వున్నాయని పరిశీలకులకు భావిస్తున్నారు.


