కూటమి ఐక్యత విచ్ఛిన్నానికి వైసీపీ కుట్రలు.. ఒక్క పదంతో విచ్ఛిన్నం చేసిన లోకేష్!

posted on: Aug 6, 2026 2:45PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అధికార తెలుగుదేశం కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య బంధం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మధ్య పెనవేసుకున్న అన్నా తమ్ముళ్ల బంధం కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నది.    జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్న పొలిటికల్ ఎట్మాస్మఫియర్ క్రియేట్ చేయడానికి వైసీపీ చేస్తున్నప్రయత్నాలను పవన్, లోకేష్ సమర్ధంగా తిప్పికొట్టడానికి నారా లోకేష్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానం ఊతంగా నిలిచింది.  

 వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా  లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య  పోటీ ఉందన్న ప్రచాన్ని విస్తృతంగా, నిరంతరాయంగా కొనసాగిస్తూ వస్తోంది.   ముఖ్యంగా  పాలనా విషయాల్లో పవన్ కళ్యాణ్‌ను తోసి రాజని.. లోకేష్   ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతున్నారంటూ ఊదరగొడుతోంది. ఆ మేరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ అనుకూల మీడియా కథనాలను వండి వారుస్తోంది. అసందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఎవరిదన్న చర్చను లేవనెత్తుతో..  జనసేన శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు శతధా ప్రయత్నిస్తున్నది. 

అయితే.. వైసీపీ వ్యూహాన్ని మంత్రి నారా లోకేష్ సమర్ధంగా, వ్యూహాత్మకంగా తిప్పికొడుతున్నారు.  మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియా వేదకగా షేర్ చేసే పోస్టుల్లో.. లోకేష్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చిన ప్రతి సారీ పవనన్నా అంటూ  ఆత్మీయ సంబోధన చేస్తున్నారు.   ఇది కేవలం ఒక మాట వరసకు అన్న పదంగా కాకుండా,  కూటమి ఐక్యతను దెబ్బతీయాలనుకున్న ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తున్న పొలిటికల్ స్ట్రోక్ గా, స్ట్రాటజీగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  తుత్తునియలు చేసిన ఒక పక్కా పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్.

ప్రతివేదికపైనా  లోకేష్ పవనన్నా అంటూ పదే పదే సంబోధించడం ద్వారా..  జనసేన శ్రేణులకు, అలాగే టీడీపీ వర్గాలకు తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య విభేదాలు లేవనీ, అన్నదమ్ముళ్లలా కలిసి మెలిసి ఉంటున్నామన్న బలమైన సందేశాన్ని ఇస్తున్నారు.   పవన్ కళ్యాణ్‌కు ఇచ్చే గౌరవంలో గానీ, హోదాలో గానీ  తగ్గేదే లే అన్న విస్పష్ట సందేశం ద్వారా నారా లోకేష్ వైసీపీ కూటమి పార్టీల మధ్య విభేదాలంటూ చేస్తున్న ప్రచారాన్ని పూర్వపక్షం చేయగలుగుతున్నారు.   

లోకేష్ పవన్ కల్యాణ్ కు ఇస్తున్న గౌరవం, ఆయన పట్ల చూపుతున్న అభిమానం జనసేన శ్రేణుల్లో కూడా కూటమి ఐక్యతపై విశ్వాసాన్ని పెంపొందేలా చేస్తున్నది.   పవన్ కళ్యాణ్, లోకేష్ కలివిడి తనం, పరస్పర అభిమానంతో కలిసి మెలిసి పని చేస్తుంటే.. రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందన్న అభిప్రాయం జనబాహుల్యంలోనూ బలంగా వ్యక్తమౌతోంది.  దీంతో వైసీపీ విభజించు, పాలించు సూత్రం ఇసుమంతైనా పని చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    నారా లోకేష్ చూపుతున్న రాజకీయ పరిణతి ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటం చేసిందంటున్నారు. 

ఒకవైపు ఐటీ, విద్యా శాఖల మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను, కీలక పరిశ్రమలనూ ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్న లోకేష్ అదే సమయంలో..  ప్రత్యర్థుల రాజకీయ కుట్రలు, వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడుతున్నారు.  పవన్ అన్నా అ సంబోధనతో.. కూటమిలో విభేదాలు, కూటమి విచ్ఛిన్నం అంటూ వైసీపీ కంటున్న కలలను కల్లలు చేయగలుగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Nara Lokesh Strengthes kutami unity, Pawan Kalyan, Pawan Anna Strategy, AP Politics, TDP Janasena Alliance  

google-ad-img
    Related Sigment News
    • Loading...