ప్రయాగ్ రాజ్ లో నారా లోకేష్.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం
posted on Feb 17, 2025 3:01PM

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో ఆయన తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ ఫొటోను ఎక్స్ లో పోస్టు చేసి రియల్లి బ్లెస్డ్ అని ట్యాగ్ ఇచ్చారు. కాగా ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన నారా లోకేష్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణం రాజు, మంత్రులు గొట్టిపాటి రవి, డోలా వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు ఉన్నారు.
వీరంతా పవిత్ర సంగమం వరకూ నదిలో పడవలపై ప్రయాణించారు. అనంతరం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. కాగా ఈ పర్యటనలో భాగంగా నారా లోకేష్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
.webp)