Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే!
posted on: Jun 12, 2020 10:40AM
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ పై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారంటూ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్ బీసీ నేత అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు." అంటూ లోకేష్ ధ్వజమెత్తారు.
"బీసీ లకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయన పై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు. లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే." అంటూ విమర్శించారు.
"రాజారెడ్డి రెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు. బడుగు,బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది." అని లోకేష్ హితవు పలికారు.


.jpg)



