Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
posted on: May 28, 2025 5:44PM
.webp)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నియ్యారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. కాగా తొలిసారి 1995లో చంద్రబాబు టీడీపీ పగ్గాలు అందుకున్నారు. 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండెళ్లకోకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.
పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక 2014లో పార్టీ అధినేత చంద్రబాబు మీద నమ్మకంతో ఏపీ ప్రజలు ఆయన్ని గెలిపించారు. 2019లో టీడీపీ మరోసారి అధికారానికి దూరమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.






