నాని కపిరాజు పాటలు విడుదల
posted on Dec 30, 2013 8:42AM

నాని హీరోగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన "జెండాపై కపిరాజు" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. వి.వి.వినాయక్ ఆడియో సిడీని విడుదల చేసి, నాని తండ్రి రాంబాబుకి అందించారు. ఈ సంధర్భంగా హీరో నాని మాట్లాడుతూ... "ఆహా కళ్యాణం" షూటింగ్ కారణంగా ఈ సినిమాకు అడపాదడపా అంతరాయాలు ఏర్పడినా కూడా దర్శకుడు సముద్రఖని భరించారు. నా నుండి తనకు ఏం కావాలో అది రాబట్టుకున్నారు. ఇరవై, ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న నటులు మాత్రమే చేయగలిగే ఫీట్ ని.... అతి తక్కువ సమయంలో చేసే అవకాశం నాకు ఈ సినిమా ద్వారా దక్కింది. అది నిజంగా నా అదృష్టం. ఈ సినిమ నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా నటన వలన ఈ సినిమా వంద రోజులు ఆడితే.. తమిళంలో జయం రవి నటనకు 175 రోజులు ఆడుతుంది." అని అన్నారు. ఈ చిత్రంలో నాని సరసన అమలాపాల్, రాగిణి కథానాయికలు. జివిప్రకాష్ సంగీతాన్ని అందించాడు.