శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
posted on Jul 12, 2025 9:06PM

నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్యామ్ గేట్లను ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. పర్యాటకులు ఇదే క్రమంలో దోమలు పెంట నుంచి సున్నిపెంట వరకు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ మూడు గంటలుగా రహదారిపై నిలిచిపోయాయి.
వాహనాలు అంతేకాకుండా శని ఆదివారం సెలవులు కావడంతో శ్రీశైల దైవ దర్శనార్థం వచ్చే భక్తులతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి జాలువారే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు భారీగా సొంత వాహనాల్లో తరలివస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇదే సందర్భంలో లింగాల గట్టు గ్రామంలో జోరుగా చేపల అమ్మకాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం రెండవ పట్టణ పోలీస్ అధికారులు ట్రాఫిక్ రాకపోకలకు ఏర్పడిన అంతరాయాన్ని నియంత్రించే విధంగా చర్యలు చేపట్టారు.