కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్ 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్  వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది.  అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి  కోర్టుకు వచ్చారు. 
ఈ కేసులో ఆయన తప్పించుకుతిరుగుతున్నారు. . ఈ కేసు కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చింది ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులోనే  లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu