Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సెక్యూరిటీని చూపి అందరిని బెదిరిస్తున్నాడు.. రఘురామరాజు పై ఎంపీ సురేష్ ఫిర్యాదు
posted on: Sep 25, 2020 12:44PM
వైసిపికి ఎంపీ రఘురామకృష్ణం రాజుకు మధ్య వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రఘురామరాజు కేంద్రం తనకు ఇచ్చిన భద్రతను చూపి అందరిని బెదిరిస్తూ.. భయపెడుతున్నారని బాపట్ల వైసిపి ఎంపీ నందిగం సురేష్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఏకంగా తన చర్మం వలిచేస్తానని, తనను కులపరంగా దూషించారంటూ సురేష్ ఈ సందర్భంగా రఘురామ రాజు పై ఆరోపించారు. ఎంపీ రఘురామ రాజుకు ఇచ్చిన భద్రతను వెంటనే తొలగించాలని అయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే వైసిపికి కొరకరానికొయ్యగా తయారైన రఘురామ రాజునూ ఎదుర్కొనేందుకు వైసీపీ ఎంపీ సురేష్ ను ముందు పెట్టి.. ఆయన కులం కార్డును తెరపైకి తెచ్చినట్లుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిత్యం రచ్చబండ పేరుతొ వైసిపి నేతలపై ఘాటు కామెంట్లు చేసే ఎంపీ రఘురామ రాజు దీని పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.






