నాందేడ్ రైలు ప్రమాదం.. గ్రానైట్ రాయికి పూజలు


 


బెంగుళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురలంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణాలను బలిగొన్న గ్రానైట్ రాయికి ఎవరో పూజలు చేశారు. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టారు పూజలు చేయడంతో కలకలం రేపింది.

అయితే గ్రానైట్ రాయికి సంబంధించిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఇంకోసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే పూజలు నిర్వహించారని మరికొందరు అంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తక్కువ ప్రాణ నష్టం జరిగినందుకు రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పూజలు ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కాని ఇప్పుడు అక్కడ అది పెద్ద హాట్ టాపిక్ అయింది.