డీసీపీ, ఏసీపీ పై సీఈసీకి సుహాసిని ఫిర్యాదు

posted on: Dec 6, 2018 4:02PM

 

కూకట్‌పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీ) ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీసీపీ బంధువు, కృష్ణారావుకు ఏసీపీ బంధువు అని చెప్పారు. తమ కింద పనిచేస్తున్న పోలీసుల ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలంటే...ఏసీపీ, డీసీపీలను వెంటనే బదిలీ చేయాలని సుహాసిని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలాజీనగర్‌లో తమ బంధువులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దూషించి, దాడి చేస్తే పోలీసులు అడ్డుకోలేదన్నారు. అల్లాపూర్‌, ఓల్డ్‌బోయినపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు తరలించాలని సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...