ఎన్టీఆర్ కి కుటుంబ సభ్యుల నివాళి

posted on: Jan 18, 2019 8:55AM

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహసిని, దర్శకుడు క్రిష్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ....బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సుహాసిని మాట్లాడుతూ... తన తాత ఎన్టీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తామని, ఆయన స్ఫూర్తితో ముందడుగు వే​స్తున్నామని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేశారన్నారు. ప్రజలు ఆయనకు దేవుళ్ల సమానమని, వారి కోసం ఎంతో పాటు పడ్డారని చెప్పారు. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించామని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...