TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ భేటీ

Published on: Fri Feb 13, 2026 10:09AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత ప్రజాదరణ  వ్యక్తులు నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. సినీమా హీరోలుగా వారిరువురికీ కూడా అశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. అదే సమయంలో రాజకీయాలలోనూ ప్రజలతో మమేకమౌతూ ప్రజా నాయకులుగా గుర్తింపు పొందారు.

అటువంటి వీరిరువురూ  కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వీరిరువురూ గురువారం (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను హిందూపురం ఎమ్మెల్యే హోదాలో నందమూరి బాలకృష్ణ కలిశారు. స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి వెళ్లిన బాలకృష్ణ కొది సేము ఆయనతో ముచ్చటించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  ఈ సందర్భంగా బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురం అభివృద్ధికి సహకరించాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించారు.