Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సెల్‌ఫోన్ యూజర్లకి శుభవార్త!
posted on: May 3, 2024 4:38PM
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు. ఇంతలో మీకో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మీ కాంటాక్ట్ లిస్టులోది కాదు.. నంబర్ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అదొక దిక్కుమాలిన ఫోన్. లోన్ ఇస్తామనో, ఇన్సూరెన్స్ తీసుకోమనో, అనాథాశ్రమానికి సాయం చేయమనో ఆ ఫోన్ల సారాంశం. దాంతో మీకు చిరాకు వచ్చేస్తుంది. ఇకపై ఇలాంటి చిరాకు పడాల్సిన అవసరం వుండదు. ఇకపై మీకు ఎవరు ఫోన్ చేసినా, ఆ నంబర్ మీ కాంటాక్ట్స్.లో లేకపోయినా ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని టెలీకాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అతి త్వరలో మీకు ఫోన్లు వచ్చినప్పుడు ఆ ఫోన్ నంబర్ ఎవరి పేరున వుందో ఆ పేరు కనిపిస్తుంది. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రూ కాలర్ లాంటి కొన్ని యాప్స్.ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కాలర్ ఐడెంటిటీని తెలుసుకునే సదుపాయం వుంది. కానీ, అలాంటి యాప్స్ మీద ఆధారపడటం అంత మంచిది కాదు. మన ఫోన్ మీద ఆ యాప్ పూర్తి అధికారాన్ని సాధిస్తుంది. అది అంత శ్రేయస్కరం కాదు. ఇప్పుడు ట్రాయ్ ఆదేశాలతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే కాలర్ ఐడెంటిటీ ఫోన్లో తెలిసిపోతుంది. ఈ సదుపాయాన్ని ఒక నెల రోజుల్లోనే హర్యానా రాష్ట్రంలో మొబైల్ కంపెనీలు ప్రారంభిస్తాయి. కొంతకాలం తర్వాత దేశమంతటా ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది.






