Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ గూటికి నల్లాల ఓదెలు
posted on: May 19, 2022 5:17PM
తెరాస సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగా ఓదెలుకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచీ భాగస్వామి అయిన ఆయన గత కొంత కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. కాగా కాంగ్రెస్ గూటికి చేరిన అనంతరం ఓదెలు మాట్లాడుతూ బాల్క సుమన్ వల్లనే తాము టీఆర్ఎస్ వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బాల్క సుమన్ తమను తీవ్ర మసన్తాపానికి గురి చేశారని పేర్కొన్నారు.
కాగా రేవంత్ రెడ్డి వల్లనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.
టీఆర్ఎస్ అధినాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఓదెలు గత కొన్ని రోజులుగా పార్టీ మారే విషయమై తన సన్నిహితులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నల్లాల ఓదెలు టీఆర్ఎస్ ను వీడడం చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నల్లాల ఓదెలు కాంగ్రెస్ కు చేరడంతో బలహీనపడుతుందనడంలో లేదని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఓదెలు కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్యమ నేతగా ఓదేలుకు నియోజకవర్గ ప్రజలలో అభిమానం మెండుగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఓదెలు నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఉద్యమంలో ఇబ్బందులు పడిన వారిని ఆదుకున్న చరిత్ర కూడా ఓదేలుకు నియోజకవర్గ ప్రజలలో మంచి గుర్తింపును తీసుకువచ్చింది.






