TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోయిడాలో నల్గొండ విద్యార్ధి దారుణ హత్య.. కాల్పులు జరిపి నరికి చంపారు

Published on: Mon Oct 19, 2015 10:19AM



నల్గొండజిల్లాకు చెందిన విద్యార్ధి ఉత్తరప్రదేశ్ లో దారుణ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితులే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం నల్గొండ  జిల్లా శ్రీనగర్ కాలనీకి చెందిన సందేశ్ అనే వ్యక్తి నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో  బీఎస్సీ (మెరైన్ సైన్స్) కోర్సు చేస్తున్నాడు. అయితే సందేశ్ మొదటి సంవత్సరం కాలేజ్ హాస్టల్లో ఉండి చదువుకోగా.. రెండవ సంవత్సరం ప్లాట్ అద్దెక్ తీసుకొని అందులో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో అదే యూనివర్సిటీలో చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీ సందేశ్ నివాసముంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చి అతనిపై నేరుగా కాల్పులు జరిపి.. ఆతరువాత గొడ్డలితో నరికారు. అయితే సందేశ్ రూంలో ఉన్న అతని స్నేహితుడు నదీమ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. నదీమ్ జరిగిందంతా పోలీసులకు వివరించగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు.

కాగా సందేశ్ మరణవార్తను పోలీసులు అతని తండ్రికి చేరవేయడంతో అతను వెంటనే నోయిడాకు చేరుకొన్నాడు. ఆదివారం పోస్టుమార్టం పూర్తిఅయిన అనంతరం మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.