నగ్నంగా ఇరుక్కుపోయింది
posted on Jan 5, 2015 11:21AM

నిజంగా ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఈ సంఘటన జరిగింది అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరంలో. పెళ్ళయి, ముగ్గురు పిల్లల తల్లి అయి, భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ ఆ తర్వాత ఓ వ్యక్తితో కొంతకాలం ‘స్నేహం’ చేసింది. ఆ తర్వాత అతని నుంచి కూడా విడిపోయింది. అయితే ఈమధ్యకాలంలో అతనితో స్నేహం కొనసాగించాలని అనుకుంటోంది. ఆదివారం రాత్రి ఆ మహిళ తన మాజీ ప్రియుడి ఇంటికి వచ్చింది. ఆ ఇంటి తలుపులు వేసి వున్నాయి. తలుపు కొడితే మాజీ ప్రియుడు వచ్చి తలుపు తీసేవాడే. అయితే అతన్ని సర్‌ప్రైజ్ చేద్దామని అనుకుందో, మరో ఉద్దేశం ఏమైనా వుందో, లేక ఆమె ఖర్మ కాలిందోగానీ, ఆమెకి ఒక వెరైటీ ఐడియా వచ్చింది. వెంటనే ఆ ఐడియాని అమల్లో పెట్టేసింది. మాజీ ప్రియుడి ఇంటి పైకి ఎక్కి, తన ఒంటిమీద వున్న బట్టలన్నీ తీసేసి ఆ ఇంటికి వున్న పొగగొట్టంలోంచి ఇంట్లోకి దిగే ప్రయత్నం చేసింది. సగం దూరం వెళ్ళాక ఆమె పొగగొట్టంలో ఇరుక్కుపోయింది. దాంతో కెవ్వుమని అరిచింది. ఆమె మాజీ ప్రియుడు ఇదెక్కడి గోలరా బాబూ అనుకుంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఆ పొగగొట్టం పగులగొట్టి ఆమెని బయటకి తీశారు. పొగ గొట్టంలో పూర్తి నగ్నంగా వున్న ఆమెని చూసి బిత్తరపోయారు. స్వల్ప గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.