TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దాసరి ని పట్టించుకోం... నాయక్ తరుపున స్వారీ : నాగబాబు

Published on: Sat Dec 22, 2012 8:01AM

 

nagababu ramcharan, ramcharan nayak auio launch,  ramcharan nayak, nayak ram charan tej

 

 

'నాయక్' చిత్రం ఆడియో ఫంక్షన్ లో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ చేసిన వ్యాఖ్యలను కూడా పట్టించుకోవద్దని నాగబాబు అన్నారు. చెర్రీ యువకుడు అయినందున అందులోని ఆవేదనను అర్ధంచేసుకోవాలని, ఆగ్రహాన్ని పట్టించుకోవద్దని నాగబాబు కోరారు. ఒకవేళ చరణ్ తప్పు మాట్లాడి ఉంటే తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు.


అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చా అంటూ దర్శకరత్న దాసరి నారాయణ రావు చేసి వ్యాఖ్యలు చిరంజీవి గురించేనన్న టాక్ వచ్చింది. అయితే ”ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని” చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు తేలిగ్గా తీసేశారు. దర్శకుడు సురేష్ కృష్ణ రాసిన “భాషాతో నేను” పుస్తకావిష్కరణ సంధర్భంగా గురువారం దాసరి చేసిన వ్యాఖ్యలు చిత్రరంగంలో పెనుదుమారం రేపాయి. అయితే నాగబాబు మాత్రం పట్టించుకోనట్లుగా మాట్లాడారు.