Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్నికల వాయిదాకు, కులానికి సంబంధమేమిటన్న నాగబాబు
posted on: Mar 16, 2020 11:56AM

ఎన్నికలకన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, అన్నిటికన్నా, మనిషి ప్రాణాలు ముఖ్యం కదా. ఎన్నికలు ఆపలేదు, వాయిదా వేశారు అంతేగా అంటూ నాగబాబు హితవు చెపుతున్నారు. ఈ ఎలక్షన్ అకౌంట్ లో కారోన ఎఫెక్ట్ కిఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. వైసీపీ వాళ్ళకి వాళ్ళ సపోర్టర్స్ కి ఎందుకు ఇంత బాధట్విట్టర్ వేదికగా నటుడు నాగబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, "కొంత మంది మీడియా వ్యక్తులు కూడా ఈ వాయిదాని వాళ్ల వెట్ సైట్స్ లో విమర్శిస్తుంటే ఆశ్చర్య పోయాం. మీరు వైసీపీ ని సమర్ధిస్తే తప్పు లేదు.. కానీ వైసీపీ కన్నా మీరే ఎక్కువ బాధ పడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. లైఫ్ కన్నా ఏది ఎక్కువ కాదు. బాధ పడటం మాని తక్షణ చర్యల మీద ఫోకస్ పెట్టండి" అని అన్నారు. ఆపై "కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రావు. భరించాలి. ప్రజారోగ్యం ముఖ్యం. ఫోకస్ ఆన్ ఇట్. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలని విమర్శించటం మాని ప్రజారోగ్యము మీద దృష్టి పెట్టండి. 151 మంది ఎంఎల్ఏలని ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమం ముఖ్యం. థాంక్స్ సీఎం గారు" అని నాగబాబు అన్నారు.
ఎన్నికల వాయిదాకు, కులాల ప్రస్తావన ఎందుకు,కులాల మీద పగ ఎందుకు..ఒక పక్క ఇండియా govt పబ్లిక్ హెల్త్ విషయం లో high alert ప్రకటించింది.అంటే అర్థం విషయం చాలా తీవ్రంగా ఉంటేనే అలా ప్రకటిస్తారు. తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాల్లోని కారోన స్ప్రెడ్ కాకుండా పబ్లిక్ మూవ్మెంట్స్ మీద Restrictions పెట్టారు.ఒక వేళ ఎలక్షన్స్ అనేవి పబ్లిక్ తో ముడిపడిన విషయం.పబ్లిక్ గ్యాదరింగ్స్ జరుగుతాయి. జనాల ఆరోగ్యం తో ఆడుకోవటం వైసీపీ ప్రభుత్వానికి కి కరెక్టా.. మందుల్లేక ఏమిచెయ్యలో అన్ని దేశాలు ఏడుస్తుంటే ..పారాసిటిమాల్ వేసుకొంటే సరిపోతుందని చెప్పటం బాధ్యతరాహిత్యం కదా, అంటూ కూడా ముఖ్యమంత్రిని నాగబాబు కడిగేశారు.






