వైసీపీకి మైసురా గుడ్ బై..
Published on: Wed Apr 27, 2016 10:52AM

ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి ఎంతో మంది నేతలు టీడీపీ గూటికి చేరారు. ఇప్పుడు మరో సీనియర్ నేత కూడా జగన్ కు గట్టి షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ల్ నేరుగా జగన్ కే పంపనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో ఉన్న మైసూరా... పార్టీ వీడేందుకే నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.


