TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మ‌నీలాండ‌రింగ్ కేసులో నా తీర్పు వేరే ... జ‌స్టిస్ లావు

Published on: Wed Aug 17, 2022 4:10PM

మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై  న్యాయ నిపుణులు, మాజీ  న్యాయమూర్తులు చేసిన  వ్యాఖ్యలను తాను చదివానన్నారు. ఒకవేళ తానే తీర్పు ఇచ్చి ఉంటే వేరే వైఖరిని తీసుకునేవాడి నని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కఠినమైన నిబంధనలు సరైనవేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు భిన్నాభిప్రాయాలున్నాయని జస్టిస్‌ లావు నాగేశ్వరరావు చెప్పారు. 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లీఫ్‌ లెట్‌ అనే సంస్థ జీవితం- స్వేచ్ఛ అన్న అంశంపై నిర్వ హించిన ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగిస్తూ చ‌ట్టంలోని సెక్షన్‌ 45 రాజ్యాంగంలోని 14, 21వ అధిక రణాలను ఉల్లంఘిస్తుందని గతంలో నికేష్‌ షా కేసులో సుప్రీంకోర్టు మరో రకమైన తీర్పు ఇచ్చిన విష యాన్ని ఆయ న గుర్తు చేశారు.

నేర న్యాయవ్యవస్థ మౌలిక సూత్రం ప్రకారం ఒక నేరారోపణకు గురైన వ్యక్తికి అతడు ఏమి నేరం చేశాడో చెప్పాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ నాగేశ్వరరావు అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తమను ఎందుకు పిలిచిందో తెలియని పరిస్థితి ఉండడం సరైన విధానం కాదని అన్నారు. కేసు నమోదుకు సం బంధించిన ఈసీఐఆర్‌ పత్రాలను ఈడీ ఇవ్వకపోతే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేవారు తమనెలా సమర్థించుకోగలుగుతారని ఆయన ప్రశ్నించారు. అందువల్ల మనీలాండరింగ్‌ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగత స్వేచ్చకు విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయం ఏర్పడిందని తెలి పారు. 

సుప్రీంకోర్టుపై తాను విశ్వాసం కోల్పోతున్నానంటూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలతో తాను ఏకీభవించలేనని జస్టిస్‌ నాగేశ్వరరావు చెప్పారు. కేవలం కొన్ని తీర్పులు తమకు ఇష్టం లేనందువల్ల గత 75 ఏళ్లుగా మనుగడలోఉన్న ఒక సంస్థపై నమ్మకం కోల్పోరాదని ఆయన చెప్పా రు. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కును అనుభవించే అవకాశం ఎందరికో కలిగించిందని తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. కోర్టుల జోక్యం వల్లనే కూడు, గూడు విద్య వంటి సమ స్యలకు పరిష్కారం లభించిన సందర్భాలున్నాయని ఆయన వివరించారు.