యుపి అల్లర్లలో 30 మంది బలి

 

గత నాలుగు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మతఘర్షనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ అల్లర్లలో 30 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. 

పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రమిస్తుంది. లోకల్‌ పోలీస్‌తో పాటు వేల సంఖ్యలో సైన్నాని కూడా అల్లర్లు అదుపు చేయడానికి వినియోగిస్తున్నారు. అవసరమయితే కాల్పులు జరపడానికి కూడా పోలీస్‌ శాఖకు అధికారాలు ఇచ్చారు.

ఈనేపధ్యంలో ప్రభుత్వం పై ప్రతి పక్షాల వివర్శలు కూడా ఎక్కువయ్యాయి. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ, బీఎస్పీ సీఎం అఖిలేష్ రాజీనామా చేయాలని  డిమాండ్ చేశాయి. దీంతో అఖిలేష్‌ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం అయిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ బిఎల్‌ జోషి కేంద్రానిరి నివేదిక పంపారు. ఈ పరిస్థితుల్లో అల్లర్లను అదుపు చేయటంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కొవటం కూడా అఖిలేష్‌ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.