TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Published on: Thu Jun 2, 2016 2:47PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యకర్తలతో కలిసి ఆయన విజయవాడ చేరుకుని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.