ముస్లిం మహిళలకూ సమాన హక్కులు

 

దేశంలో ముస్లిం మహిళల గౌరవానికి, భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ముఖ్యంగా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడం, భర్త రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడంలాంటి విషయాల్లో ముస్లిం మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఆ విషయంలో వాళ్లకి భద్రత ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది, ఎన్నో చట్టాలున్నా ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైనా, వివక్షపైనా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది, భారతదేశ చట్ట ప్రకారం అందరిలాగే ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ఈ విషయంలో ముస్లిం మహిళలపై ఎందుకు వివక్ష చూపాలని వ్యాఖ్యానించింది, దీనిపై కేంద్రం వైఖరి ఏంటో తెలియజేయాలన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.... అటార్నీ జనరల్ కు నోటీసులు ఇచ్చింది, అందరినీ సమానంగా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తితోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది.