నేదునూరి కృష్ణమూర్తి కన్నుమూత

Publish Date:Dec 7, 2014

 

ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు, ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి (87) విశాఖలో కన్నమూశారు. పెరిగిన వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. సోమవారం ఉదయం విశాఖ పట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 1927 అక్టోబర్ 10వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో నేదునూరి జన్మించారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం ఆస్థాన సంగీత విద్వాంసుడిగా కూడా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో ఆయన అన్నమయ్య కృతులకు స్వరాలను సమకూర్చారు. పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు నేదునూరి గారు. మద్రాసు సంగీత అకాడమీ ఆయనని ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నేదునూరి కృష్ణమూర్తి 1995లో కళానీరాజనం పురస్కారం అందుకున్నారు.

By
en-us Political News