TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సౌండు తగ్గించమన్నాడని చంపేశాడు!

Published on: Wed Feb 24, 2016 1:37PM

 

దక్షిణ దిల్లీలో జరిగిన ఈ సంఘటన దేశరాజధానిలో కూడా ఎలాంటి పరిస్థితులు రాజ్యమేలుతున్నాయో చెబుతోంది. వివరాల్లోకి వెళ్లతే హర్‌దీప్‌ అనే ఒక జర్నలిస్టు తన మిత్రుడితో కలిసి విశ్రాంతి తీసుకుంటుండగా, దిగువ అంతస్తులో ఉన్న జిమ్‌ నుంచి పెద్దగా సంగీతం వినిపించడం మొదలుపెట్టింది. కిందకి వెళ్లి చూస్తే జిమ్‌ యజమాని అయిన రింకూ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి తాగి తందనాలాడుతూ కనిపించాడు. రింకూని సౌండ్‌ తగ్గించమంటూ హర్‌దీప్‌ ఎంతగా అడిగినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు హర్‌దీప్‌.

 

అక్కడితో ఈ విషయం సద్దుమణగలేదు. మా ఇంటికే వచ్చి సౌండ్‌ తగ్గించమంటావా అంటూ రింకూ పైకి వచ్చి మరీ హర్‌దీప్‌ను కాల్చిపారేశాడు. కాల్పులు జరిగిన వెంటనే హర్‌దీప్‌తో ఉన్న స్నేహితుడు పోలీసులకి, ఆంబులెన్స్‌కి ఎంతగా ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఇక చేసేది లేక కొనప్రాణంతో ఉన్న మిత్రుడిని ఆటోలో తీసుకువెళ్లాడు. హర్‌దీప్ ఆసుపత్రికి చేరుకునేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. నిందితులు పరారీలో ఉన్నారు!