Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోడలిని వేధించిన మామ ఖేల్ ఖతమ్
posted on: May 21, 2015 1:32PM

కోడలిని వేధిస్తున్న మామగారి ఖేల్ ఖతమైంది. కోడలి సోదరుడు సదరు మామగారిని హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. థానే జిల్లాలోని మురబాద్ తాలూకాలో దర్శంత్ ఠాకరే అనే 20 ఏళ్ళ యువకుడు తన సోదరిని ఆమె మామ వేధిస్తున్న విషయం తెలుసుకుని నిలదీయడానికి ఇద్దరు వ్యక్తులతో కలసి సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఆగ్రహానికి గురైన దర్శంత్ తన సోదరి మామ దామూ తలమీద కర్రతో బలంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత నిందితులు పరారయ్యారు. పోలీసులు నిందితులను వెతికే పనిలో వున్నారు.






