Latest News
రాజకీయ పార్టీలకు గుణపాటం చెప్పిన మున్సిపల్ ఫలితాలు
posted on: May 13, 2014 8:14AM
.png)
నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అన్నిరాజకీయపార్టీలకు గుణపాటం వంటివని చెప్పవచ్చును. మాయమాటలతో, భూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూసే రాజకీయ నేతలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పగలరని నిన్నటి మున్సిపల్ తీర్పు ఋజువు చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక కంట ఆనంద బాష్పాలు, మరొక కంట కన్నీరు కార్చవలసిన విచిత్ర స్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ, దానిని టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ లాగ గట్టిగా ప్రచారం చేసుకోలేక పోయారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. కానీ, ప్రజాభిప్రాయానికి వీసమెత్తు విలువీయకుండా రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంద్రా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కటినంగా శిక్షించారు. ఇది రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించే తీర్పు అని చెప్పవచ్చును. అదేవిధంగా ఎటువంటి సిద్దాంతాలు లేకుండా ప్రజల భావోద్వేగాలను, సానుభూతిని వారి బలహీనతగా భావించి రాజకీయాలు చేసేవారికీ ఈ ఎన్నికలలో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారనుకోవచ్చును.
రాజకీయంగా చైతన్యవంతమయిన ప్రజలను మభ్యపెట్టడం అంటే రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని ఈ మున్సిపల్ ఫలితాలు ఋజువు చేసాయి. ప్రజలు ఇప్పుడు సమర్ధమయిన పాలన కోరుకొంటున్నారని, అది అందించే వారికే తమ ఓటు అని మరొకమారు గట్టిగా చాటిచెప్పారు.అయితే ఇప్పటికే ప్రజలు అన్ని ఎన్నికలలో అంతిమ తీర్పు ఇవ్వడం జరిగిపోయింది గనుక, ఎన్నికలలో గెలిచిన రాజకీయ పార్టీలు ఇకనైనా తమ ఆలోచన ధోరణిలో, పద్దతులలో ప్రజానుగుణంగా మార్పు తెచ్చుకొని చక్కటి పరిపాలన అందించగలిగితే, ఓట్లకోసం ప్రజలను ఇంతగా ప్రాధేయ పడవలసిన అవసరం ఉండదని గ్రహించితే మేలు.


.jpg)
.jpg)


