TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబైకి ఉగ్రముప్పు.. పోలీసులు అలర్ట్!

Published on: Sat Sep 28, 2024 1:57PM

దేశ  ఆర్థిక  రాజధాని ముంబయి మహా నగరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ మేరకు  కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన స్పష్టమైన సమాచారంలో  మహారాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు.  భద్రతను కట్టుదిట్టం చేసేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.   ముంబయిలోని  ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ఏరియాలో పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ముంబయిలో ప్రతిఏటా దుర్గాపూజ, దీపావళి పండగలను ఘనంగా జరుపుకుంటారు. ఆ పండుగలు సమీపిస్తున్న వేళ  మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరిగనున్న వేళ ఉగ్రవాదుల నుంచి ముప్పు  హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి.