TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్.. కోర్టుకి రా నాయనా...

Published on: Mon Mar 30, 2015 6:51PM

 

రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్ఎస్ఎస్‌కి వ్యతిరేకంగా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్.ఎస్.ఎస్. నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావడం లేదు. రాహుల్ సారు వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు రావడం లేదని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మే 8వ తేదీన రాహుల్ గాంధీ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.