TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడివిలో తప్పిపోయిన విద్యార్థులు.. కాపాడిన పోలీసులు

Published on: Sun Jul 27, 2025 6:55PM

 

ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం మహితాపురం గ్రామ పరిధిలోగల మహితాపురం వాటర్ ఫాల్స్ సందర్శనకు విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులైన ఏడుగురు NIT విద్యార్థులు (4గురు అబ్బాయిలు,  3గురు అమ్మాయిలు) దారితప్పి అడివిలో దారితప్పి గల్లంతవగా సమాచారం అందుకున్న వెంకటాపురం సిఐ కుమార్, వెంకటాపురం ఎస్ఐ తిరుపతి, మరియు వారి సిబ్బంది వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకొని  తప్పిపోయిన ఏడుగురు విద్యార్థులను ఫారెస్టు సిబ్బందితో కలిసి రెస్క్యూ చేసి వారిని కాపాడారు..

ములుగు జిల్లా అధికార యంత్రాంగం భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని వాటర్ ఫాల్స్ సందర్శనను నిషేధించిన నేపథ్యంలో ఎవరికి చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా నిబంధనలు మీరే వచ్చినటువంటి విద్యార్థుల ను పోలీసులు మందలించి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ల బంధువులకు అప్పగించారు.

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా వాటర్ ఫాల్స్ సందర్శనకు రాకూడదని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధన ఉల్లంఘించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేశారు.