TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ములాయం మనవడు, లాలూ కుమార్తె పెళ్ళి...

Published on: Fri Nov 28, 2014 10:43AM

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ మధ్య బంధుత్వం పెనవేసుకోబోతోంది. మొన్నటి వరకూ ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడేది కాదు. నరేంద్రమోడీ పుణ్యమా అని వీరిద్దరూ ఈమధ్య ఫ్రెండ్సయ్యారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ బంధుత్వంగా కూడా మారబోతోంది. ములాయం మనవడు తేజ్ ప్రతాప్‌కి లాలూ ప్రసాద్ చిన్న కూతురు రాజలక్ష్మికి పెళ్ళి చేయాలని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరగబోతోంది. ఈ ఎంగేజ్‌మెంట్‌ని కళ్ళు చెదిరేలా చేయాలని లాలూ, ములాయం కుటుంబాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్‌కి అల్లుడు కాబోతున్న తేజ్ ప్రతాప్ తాతచాటు మనవడేం కాదు..ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయంసింగ్ యాదవ్ సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టారు.