Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు, లోకేశ్ దీక్ష చేయాలి...నాకు కొంచెం చోటు ఇవ్వాలి..
posted on: Jan 30, 2017 11:17AM
.jpg)
ప్రత్యేక హోదాపై ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ట్వీట్టర్లో వేడి పుట్టిస్తున్నాడు. ఇప్పుడు దీనిపై కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా స్పందించాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ యువనేత లోకేశ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టాలని.. దీక్షలో కొంచెం చోటు ఇస్తే తాను కూడా కూర్చుంటానని ముద్రగడ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం తగువు పెట్టుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు ఆగిపోతుందని...ఆ ప్రాజెక్టు విభజన చట్టంలోని అంశమే కదా అని అడిగారు. రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్నారని, తాము కాపు రిజర్వేషన్లను సాధించి తీరుతామని ఆయన అన్నారు.


.jpg)



