చంద్రబాబు చేస్తారని నమ్ముతున్నా.. ముద్రగడ

 

కాపులకు ఇచ్చిన హామీలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతారని నమ్ముతున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అంటున్నారు. వైఎస్సార్సీపీ విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను కలవడానికి వెళ్లిన ముద్రగడ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తమ జాతికి రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడతామని అన్నారు.